ఒకప్పటి సీరియస్ విలన్ ఇప్పుడు దర్శకుడిగా మారాడు

by సూర్య | Sun, Oct 13, 2019, 12:47 PM

దాదాపు రెండు దశాబ్దాలు విలన్ గా అనేక చిత్రాలలో నటించాడు నటుడు సత్యప్రకాష్. పోలీస్ స్టోరీ, పెళ్లిచేసుకుందా, సీతారామరాజు, సీతయ్య వంటి చిత్రాలలో సత్య ప్రకాష్ కీలకమైన విలన్ రోల్స్ చేసి మెప్పించారు. కాగా ఈ సీనియర్ విలన్ ఇప్పుడు దర్శకుడిగా మారాడు. ఉల్లాలా ఊల్లాల అనే చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడం జరిగింది. కాగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విక్టరీ వెంకటేష్ లాంచ్ చేశారు. నటరాజ్ పేరి, నూరీన్ షెరీఫ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుఖీభవ మూవీస్ బ్యానర్ పై గురు రాజ్ అత్తారి నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మూవీ విశేషాలు పంచుకున్నారు. యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ విజయం పై దర్శక నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM