'సైరా'కు 9వ రోజు కూడా మంచి వసూళ్లు

by సూర్య | Fri, Oct 11, 2019, 04:19 PM

‘సైరా’ ప్రభంజనం తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ తో మొదలైన వసూళ్ల పరంపర 9వ రోజు కూడా కొనసాగింది. దసరా పండుగను పూర్తిగా క్యాష్ చేసుకున్న చిత్రం నిన్న 8వ రోజుకే రూ.90 కోట్ల షేర్ మార్క్ టచ్ చేసింది. ఇక 9వ రోజైతే సుమారు రూ.3.1 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.


ఇందులో అత్యధికంగా నైజాం నుండి రూ.1.3 కోట్లు వసూలు కాగా ఉత్తరాంధ్ర నుండి రూ.60 లక్షలు వసూలయ్యాయి. రెండవ వారం పైగా వర్కింగ్ డే రోజున ఈ స్థాయి వసూళ్లను సాధించగలగడం నిజంగా విశేషమే అనాలి. ఈ కలెక్షన్స్ చిరు స్టామినా ఏపాటిదో చెబుతున్నాయి. ఈ రన్ ఇలాగే కొనసాగితే త్వరలోనే చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటే అవకాశాలున్నాయి.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM