హాకీ నేప‌థ్యంలో సందీప్ కిష‌న్ హీరోగా `A1 ఎక్స్‌ప్రెస్‌`

by సూర్య | Sun, Oct 06, 2019, 11:54 PM

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ లుక్‌లో ఓ స్టేడియం ముందు సందీప్ కిష‌న్ చేతిలో హాకీ స్టిక్‌ను ప‌ట్టుకుని ఉన్నారు. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది.
ఈ చిత్రానికి డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హిప్ హాప్ త‌మిళ  సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ మొద‌టి వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2020లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు.


 


 

Latest News
 
రష్మిపై నెటిజన్ల ఆగ్రహం Wed, May 15, 2024, 01:45 PM
సంచలనం రేపుతున్న హీరోయిన్ మెహ్రీన్ పోస్ట్ Wed, May 15, 2024, 12:51 PM
డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది Wed, May 15, 2024, 12:48 PM
ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్! Wed, May 15, 2024, 10:52 AM
100M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'టైగర్ నాగేశ్వరరావు' హిందీ వెర్షన్ Tue, May 14, 2024, 04:32 PM