లోడ్ లారీ బోల్తా డ్రైవర్ సురక్షితం..తప్పిన ప్రమాదం

by సూర్య | Sat, Aug 06, 2022, 02:08 PM

రావికమతం మండలంలో గుడ్డిప గ్రామం వద్ద మెటల్ తో ఉన్న లారీ శనివారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. మండలంలో గొంప గ్రామం లో ఉన్న శ్రీజ మెటల్ క్వారీ నుంచి అనకాపల్లి స్లాబ్ కు ఉపయోగించే పక్కన తీసుకెళ్తున్న లారీ కోరుకొండ వారి కల్లాల వద్ద బోల్తా పడింది. పరిమితికి మించి లోడ్ తో వెళుతున్న లారీ గోతిలో పడి బోల్తా పడింది. రోడ్డుపై ఉన్న గోతులలో వర్షపు నీరు చేరి ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


గొంప శ్రీజ మెటల్ నుంచి నిత్యం భారీ వాహనాలు ఈ రహదాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. నిత్యం ఈ రహదారిలో ఏదో ఒకచోట వాహనాలు బోల్తా పడుతూనే ఉన్నాయి. మెటల్ క్వారీ నుంచి సెస్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నప్పటికీ శిథిలావస్థకు చేరుకున్న రోడ్డును మరమ్మత్తు చేపట్టకపోవడం పట్ల గుడ్డిప గ్రామస్థులు ఆగ్రహం. వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రహదారికి ఏటా ఆర్ అండ్ బి శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టే వారిని గత మూడు ఏళ్లుగా ఆర్ అండ్ బి శాఖ ఈ రోడ్డుకు ఎటువంటి నిర్వహణ పనులు చేపట్టకపోవడం వలన భారీ గోతులు ఏర్పడి ఈ రహదారిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest News

 
ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేసిన సర్పంచి దంపతులు Sun, Aug 14, 2022, 12:26 PM
తప్పిన రైలు ప్రమాదం Sun, Aug 14, 2022, 12:25 PM
ప్రతి గడప గడపకు జగనన్న సంక్షేమ పథకాలు: మంత్రి ఉషాశ్రీచరణ్ Sun, Aug 14, 2022, 12:24 PM
ప్రశాంతంగా ఏపీ టెట్ Sun, Aug 14, 2022, 11:16 AM
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సన్మానం Sun, Aug 14, 2022, 11:16 AM