జీతాల కోసం కార్మికులు ధర్నా

by సూర్య | Sat, Aug 06, 2022, 02:09 PM

గొలుగుండ మండలంలోని పారిశుద్ధ్య కార్మికులకి 18 నెలలు నుండి వేతనాలు రాకపోవడంతో త్రీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు రావాల్సిన బకాయి వేతనాలును ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని శనివారం ఏ ఎల్ పురం పంచాయితీలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే జోలి దండుతూ పారిశుద్ధ్య కార్మికులు తమ నిరసన తెలియ చేశారు.


గత మూడు రోజులగా కార్మికలు అందోళన చేస్తున్నా కనీసం అధికారులు ఎవరు పట్టించుకొవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. మరో పక్క పారిశుద్ధ్య కార్మికులు నిరసన వలన గ్రామాలలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోవడంతో ప్రజలు త్రీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయించడానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM