నేడు ఢిల్లీకి సీఎం...ప్రతిపక్షనేత...ఇరువురు ఓ కార్యక్రామానికి హాజరు

by సూర్య | Sat, Aug 06, 2022, 03:42 AM

దేశ రాజధాని హస్తీనకు ఏపీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత ఇద్దరు బయలుదేరి వెళ్లున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. శనివారం ఆయన హస్తినకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. 3.40 గంటలకు ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం 5.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ వెళతారు.. రాత్రికి అక్కడే బస చేస్తారు.


ఆదివారం (ఆగస్టు 7న) ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌‌కు సీఎం జగన్ వెళతారు. 9.45 – 4.30 వరకు రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగుపయనం అవుతారు. రాత్రి 8.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా శనివారం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక మందిరంలో ఆజాదీ కా అమృతోత్సవ్‌ నేషసనల్ కమిటీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలనున్నట్లు సమాచారం. సాయంత్రం మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా.. ఆజాదీ కా అమృత్ ఉత్సవాలను కేంద్రం నిర్వహిస్తోంది.


ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఆజాదీ కా అమృతోత్సవ్‌ నేషనల్ కమిటీ సమావేశానికి చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. లిఖితపూర్వక ఆహ్వానం పంపడంతో పాటు ఫోన్‌ కూడా చేశారు.. దీంతో చంద్రబాబు వెళుతున్నారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతోపాటు ప్రముఖ రాజకీయ నేతలు, క్రీడాకారులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. మొత్తం 240 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Latest News

 
అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్ Mon, Aug 15, 2022, 11:10 PM
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు Mon, Aug 15, 2022, 11:09 PM
సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు Mon, Aug 15, 2022, 11:08 PM
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్ Mon, Aug 15, 2022, 10:54 PM
గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి Mon, Aug 15, 2022, 10:18 PM