వ్యవసాయ పరిశోధనపై భారీగా ఖర్చు చేయవలసిన అవసరం ఉంది

by సూర్య | Fri, Aug 05, 2022, 03:39 PM

రాజ్యసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యవసాయ మంత్రిని, ఎంపీ విజయ్ సాయి రెడ్డి  అనుబంధ ప్రశ్న వేస్తూ 2021-22లో సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం వ్యవసాయ పరిశోధనకు 8,514 కోట్ల కేటాయింపులు జరిగాయి. 2022-23 బడ్జెట్‌లో సైతం అంతే మొత్తం  కేటాయించారు.


వ్యవసాయ పరిశోధనకు ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల వలన సంభవిస్తున్న అకాల వర్షాల వంటి సమస్యలతో ఏటా పంటలు నష్టపోతూ రైతాంగం కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే వంగడాలను అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ పరిశోధనపై భారీగా ఖర్చు చేయవలసిన అవసరం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందో వివరించాలని ఆయన ప్రశ్నించారు.

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM