తెలంగణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

by సూర్య | Thu, Jun 23, 2022, 09:30 AM

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్‌ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా కొన‌సాగుతోంది. అలాగే ఇంటర్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. కానీ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌పై ఇంకా తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్‌ బోర్డ్ ఒక స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇవ్వ‌డం లేదుఈ నేప‌థ్యంలో ఇటు విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు అయోమ‌యంలో ఉన్నారు. ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో ఫ‌లితాల విడుద‌ల‌పై వివిధ తేదీలు చ‌క్క‌ర్లు కొట్టాతున్నాయి. అయితే ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, ఫ‌లితాలు ఎప్పుడు విడుద‌ల చేస్తామో త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డ్ స్ప‌ష్టం చేసింది. జూన్‌ 25 తర్వాత TS Inter Results 2022 విడుదల చేసే ఆలోచనలో తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ ఉన్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలన్నుట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9, 07, 393 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM