అజీర్తికి చెక్ పెట్టే వాము రైస్

by సూర్య | Wed, Jun 22, 2022, 08:08 PM

కావలసిన పదార్ధాలు: వాము - 1 స్పూన్, అన్నం - రెండు కప్పులు, జీలకర్ర - అరస్పూన్, ఆవాలు - అరస్పూన్, పచ్చి శనగపప్పు - 1 స్పూన్, సాయి పెసరపప్పు - అరస్పూన్, ఎండు మిర్చి - 3, చిన్నుల్లి - 2, కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - కొద్దిగా, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - తగినంత.
తయారీవిధానం:
-- ముందుగా అన్నం వండుకుని రెడీగా పెట్టుకోవాలి. అన్నం పొడిపొడిలాడుతూ ఉంటే ఈ రెసిపీకి మరింత రుచి వస్తుంది.
-- తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి తాలింపు కు సరిపడా నూనె వెయ్యండి.
-- నూనె బాగా కాగాక జీలకర్ర, ఆవాలు వేసి దోరగా వేపుకోండి.
-- ఆపై వాము, పచ్చి శనగపప్పు, సాయి పెసరపప్పు, తుంపిన ఎండు మిర్చి, చితక్కొట్టిన చిన్నుల్లి వేసి వేయించుకోవాలి.
-- వెంటనే అందులో కరివేపాకు, కొత్తిమీర, పసుపు వేసి కాస్త వేగాక చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకోండి.
-- ఉప్పు కూడా వేసి అన్నానికి ఆ తాలింపంతా పట్టేలా బాగా కలపాలి. ఇలా మూడు నిమిషాల పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వాము అన్నం త‌యార‌వుతుంది.
-- అజీర్తి, పొట్ట‌లో గ్యాస్ వంటి వాటితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఇలా వాము అన్నాన్ని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల వాటినుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM