మాస్టారు..మాస్టారు..మాంచి లుక్ లో ఉన్నారు.. ఉద్యోగం అతడి వేషాధారణనే మార్చేసింది

by సూర్య | Wed, Jun 22, 2022, 02:35 PM

మనం ఎంత దీనస్థితిలో ఉన్నామో మనముండే తీరును బట్టే అర్థమవుతుంది. కానీ విధి రాత కూడా ఎవరూ ఊహించలేనిది. అదే ఓ వ్యక్తి జీవితంలో వెలుగులు నింపింది. టీచర్‌గా పిల్లలకు చదువులు చెప్పాలని ఆయన కల. 1998 లోనే డీఎస్సీ రాసి ఎంపికయ్యారు. కానీ, నియామకాలు మాత్రం జరగకపోవడంతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ అలాగే ఉండిపోయారు. 23 ఏళ్లు గడిచిపోయాయి. ఆయన బతుకు‘చిత్రమే’ మారిపోయింది. ఉద్యోగం రాక తీవ్ర మనస్తాపానికి గురై, బతుకుదెరువు కోసం తల్లితో కలిసి హైదరాబాద్ నగరానికి వస్తే తల్లి కనిపించకుండాపోయి.. చివరికి పిచ్చోడిలా తయారయ్యారు. నిస్సహాయ స్థితిలో సైకిల్‌పై గ్రామాల్లో తిరుగుతూ చీరలు అమ్ముకుంటున్నారు. ఆయనే శ్రీకాకుళం జిల్లా సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు.


రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 1998 డీఎస్సీ అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో ఆ జాబితాలో కేదాశ్వేరరావు పేరు కూడా ఉండే అవకాశం ఉందనే వార్త స్థానికంగా వైరల్ అయ్యింది. దీంతో తెలిసిన వాళ్లు, బ్యాచ్‌మేట్స్ కేదారేశ్వరావును కలిసి అభినందనలతో ముంచెత్తుతున్నారు.


కేదారేశ్వరరావు గురించి పత్రికల్లో రావడంతో గ్రామానికి చెందిన యువత సోమవారం ఆయణ్ని సత్కరించారు. ఆయనతో కేక్ కట్ చేయించారు. ఆయనకు కొత్త బట్టలు, చెప్పులు, షూ కొనిచ్చారు. సెల్‌ఫోన్, కొంత నగదు కూడా అందజేశారు. సెలూన్‌కు తీసుకెళ్లి హెయిర్ కటింగ్ చేయించారు. మొత్తంగా కేదారేశ్వరరావుకు కొత్త రూపం తీసుకొచ్చారు.


పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు డిగ్రీ పూర్తి చేసిన అనంతరం.. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ పట్టా పొందారు. 1994లో డీఎస్సీలో స్వల్ప తేడాతో ఉద్యోగం దక్కించుకోలేకపోయారు. తిరిగి 1998లో డీఎస్సీ రాసి, ఎంపిక జాబితాలో నిలిచారు. కానీ, నియామకాలు జరగకపోవడంతో నాటి నుంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ దీనావస్థకు వెళ్లిపోయారు.


తనను తాను పోషించుకోవడానికి సైకిల్ మీద తిరుగుతూ చీరలు అమ్ముకుంటున్న కేదారేశ్వరరావు.. తన విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రాలను జాగ్రత్తగా దాచిపెట్టారు. సీది గ్రామంలోని పాడుపడిన ఇంట్లో ఉన్న తన విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు 1998లో జరిగిన డీఎస్సీ పరీక్ష హాల్‌ టిక్కెట్‌ను కూడా కేదారేశ్వరరావు చూపించారు. ఇక ప్రభుత్వం నుంచి జాబితా వెలువడటమే ఆలస్యం.. 55 ఏళ్ల వయసులో కేదారేశ్వరరావు ఉద్యోగంలో చేరనున్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM