ఈ పరిస్థితుల్లో అగ్నిపథ్ అవసరమా: అసదుద్దీన్ ఓవైసీ

by సూర్య | Wed, Jun 22, 2022, 02:34 PM

అగ్నివీరులు రెగ్యులర్ ఆర్మీలో భాగం కారని అజిత్ ధోవల్ ఒప్పుకుంటున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. . అగ్నివీరుల్లో 25 శాతం మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తే.. మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి? అని కేంద్రాన్ని ఓవైసీ ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ప్రతిపాదికన అగ్నివీరుల నియామకం వల్ల మన సంప్రదాయ సైనిక స్ట్రక్చర్‌పై ప్రభావం ఉంటుందన్నారు. ఇదిలావుంటే అగ్నిపథ్ పథకం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ కేంద్రం స్పష్టం చేసినప్పటికీ.. విపక్షాలు మాత్రం ఈ పథకంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. రైతుల ఆందోళనలతో నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగానే.. యువత ఆందోళనలతో అగ్నివీర్ పథకాన్ని సైతం ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని రాహుల్ గాంధీ కేంద్రాన్ని హెచ్చరించారు.


అగ్నిపథ్ పథకం విషయంలో వెనక్కి తగ్గేది లేదని జాతీయ భద్రతా సలహాదారు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకం విషయమై మజ్లిస్ నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. మోదీ ప్రభుత్వం అసంబంద్ధ నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. ఓవైపు చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది.. మరోవైపు పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు ఇప్పటికీ దేశంలోకి చొరబడుతున్నారు. సరైన హోం వర్క్ లేకుండా.. అగ్నిపథ్ పథకాన్ని అమలు చేయడానికి ఇది సరైన తరుణమా అని ఓవైసీ ప్రశ్నించారు. అగ్నిపథ్ పథకాన్ని సమర్థిస్తున్న వారు తమ పెన్షన్, మెడికల్ ఇన్సూరెన్స్ వదులుకోవడానికి ఇష్టపడతారా? అని నిలదీశారు. 2020లో చైనా భారత భూభాగంలోకి ప్రవేశించిందని.. మన భూభాగానికి చెందిన 1000 చ.కి.మీ. భూభాగం చైనా సైన్యం ఆధీనంలో ఉందన్న ఓవైసీ.. భారత సైన్యం అక్కడ పెట్రోలింగ్ చేయలేకపోతోందన్నారు. చైనా విషయంలో కేంద్రం చెబుతున్న దానికి చేతలకు సంబంధం లేదన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM