మార్కెట్ లోకి ‘లైట్‌ఇయర్- 0’ కారు....ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు ఏకంగా వెయ్యి కిలోమీటర్ల ప్రయాణ

by సూర్య | Wed, Jun 22, 2022, 02:26 PM

మార్కెట్ లోకి తొలిసారిగా ఎలక్ట్రికల కారు ‘లైట్‌ఇయర్- 0’ కారు రానున్నది. ఇదిలావుంటే మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల రాక తర్వాత ప్రస్తుతం కొత్త రకం టెక్నాలజీ కార్లు దర్శనమివ్వబోతున్నాయి. సోలార్ ఎలక్ట్రిక్ టెక్నాలజీతో రూపొందిన కార్లను కంపెనీలు రూపొందిస్తున్నాయి. సోలార్ ఎలక్ట్రిక్‌తో రూపొందిన ప్రపంచంలోనే తొలి‘లైట్‌ఇయర్- 0’ కారు మార్కెట్లోకి ప్రవేశించింది. నెదర్లాండ్స్‌కి చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ లైట్‌ఇయర్ ఈ సోలార్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను రూపొందించింది. ఈ కారు సింగిల్ ఛార్జ్‌లోనే 625 నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఆరేళ్ల పరిశోధన, అభివృద్ధి, డిజైన్ రూపకల్పన, ఇంజనీరింగ్, ప్రొటోటైపింగ్, టెస్టింగ్ తర్వాత ఈ సోలార్ కారు మార్కెట్లోకి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. 2016లో తనకు ఈ ఐడియా వచ్చిందని లైట్‌ఇయర్ సీఈవో లెక్స్ హాఫ్స్లట్ చెప్పారు. ఆరేళ్ల పాటు దీన్ని టెస్ట్ చేశామని, ఎన్నోసార్లు రీడిజైన్ చేశామని, ఎన్నో అవరోధాలు ఎదుర్కొని లైట్‌ఇయర్- 0 ను రూపొందించాని కంపెనీ సీఈవో చెప్పారు.


అయితే ఈ కారు ధర భారీగానే ఉంది. కంపెనీ చెప్పిన దాని ప్రకారం లైట్‌ఇయర్-0 కారును తయారు చేసేందుకే కంపెనీకి 2,50,000 యూరోల ఖర్చయింది. అంటే భారతీయ లెక్కల ప్రకారం రూ.2 కోట్లు. ప్రతేడాది 946 సోలార్ పవర్డ్ వెహికిల్స్‌ను మాత్రమే రూపొందించాలని కంపెనీ నిర్ణయించింది. దీంతో పాటు లైట్ఇయర్‌కు చెందిన తర్వాతి మోడల్‌ను కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించింది. దీని ఖర్చు 30 వేల యూరోలు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ.2.7 మిలియన్.


ఈ సోలార్ ఎలక్ట్రిక్ కారులో పైభాగంలో రెండు సోలార్ ప్యానల్స్‌ను ఇన్‌స్టాల్ చేసింది. ఈ ప్యానల్స్ ఈ కారుకి కావాల్సిన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంటాయి. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఏడు నెలలకు ఒకసారి ఈ సోలార్ ఎలక్ట్రిక్ కారుని ఛార్జ్ చేస్తే సరిపోతుంది. అయితే తక్కువ వెలుతురు ఉండే ప్రాంతాల్లో ప్రతి రెండు నెలలకు ఒకసారి ఛార్జ్ చేయాల్సి ఉంటుందని కంపెనీ చెప్పింది. సోలార్ ప్యానల్స్‌ నుంచి కాకుండా.. ఈ కారు చక్రాల్లో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్స్ నుంచి కూడా విద్యుత్‌ను పొందవచ్చు. సింగిల్ ఛార్జ్‌లో 625 కి.మీల నుంచి 1000 కి.మీల మైలేజ్‌ను ఇది ఇవ్వగలదు. జాతీయ రహదారులపై గంటకు 110 కి.మీ వేగంతో ఇది ప్రయాణించగలదు.

Latest News

 
క్వింటా ఎండుమిర్చి 12000 Sat, May 18, 2024, 11:09 AM
ఇసుక వాహనాలపై కవర్ తప్పనిసరి: ఏపీ హైకోర్టు Sat, May 18, 2024, 10:59 AM
సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి Sat, May 18, 2024, 10:53 AM
తీవ్ర అవస్థలు పడుతున్న కనిగిరి డయాలసిస్ రోగులు Sat, May 18, 2024, 10:46 AM
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు Fri, May 17, 2024, 09:17 PM