వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థత

by సూర్య | Wed, Jun 22, 2022, 12:24 PM

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అతడిని హుటాహుటిన మొహాలీలోని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సి పనిలేదని ఎమ్మెల్యేకు చికిత్స అందజేస్తున్న వైద్యులు వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామన్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ హైదరాబాద్‌లో గతేడాది సీటు సాధించిన వంశీ అడ్వాన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం ఇన్‌ పబ్లిక్‌ పాలసీ కోర్సు చేస్తున్నారు. పంజాబ్‌లోని మొహాలీ క్యాంపస్‌లో తరగతులకు హాజరవుతున్నారు. నిన్న క్లాస్‌కు వెళ్లిన ఆయనకు ఎడచేయి లాగినట్లు అనిపిస్తుండడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు 2డీ ఏకో, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించారు.

Latest News

 
ఏమి చేసిన వారు విడిపోరు Tue, Jul 05, 2022, 01:12 PM
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగిస్తున్న ముఠా అరెస్ట్ Tue, Jul 05, 2022, 01:11 PM
మురికి కాలువలో వైసీపీ ఎమ్మెల్యే నిర‌స‌న Tue, Jul 05, 2022, 01:05 PM
గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి Tue, Jul 05, 2022, 12:20 PM
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM