వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనపార్టీలోకి చేరికలు

by సూర్య | Wed, Jun 22, 2022, 12:25 PM

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్రంలో రోజు రోజుకి రాజకీయాలు తారుమారు అవుతున్నాయి అనేది వాస్తవం, మల్లి అధికారాన్ని చేజిక్కించుకోవాలి అని వైసీపీ, ఈ సారైనా గెలవాలి అని చంద్రబాబు నాయుడు, ఒక్కసారైనా సీఎం అవ్వాలి అని పవన్ కళ్యాణ్. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. ఐతే జనసేన పార్టీ మునపటి కంటే ప్రస్తుతం ప్రజల్లోకి దూసుకుపోతుంది అనడంలో సందేహం లేదు. కౌలు రైతుల కోసం తన సొంత సొమ్ముని విరాళంగా ఇస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర చరిత్రలో సొంత సొమ్మిని ప్రజలకి ఇచ్చిన రాజకీయ నాయకుడు ఇంతవరకు లేడు  అని చెప్పవచ్చు. ఈ తరుణంలో జనసేన పార్టీ  అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఆశయాలు సింద్ధాంతాలు నచ్చి జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో నంగన లోవరాజు, నంగన రెడ్డి, నంగన వెంకటరమణ, నంగన శ్రీను నంగన సత్యనారాయణ గారు, కర్నాటి శ్రీను గారు వారి కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో కలిసి జనసేన ఇంచార్జి పాతంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేన  లో చేరారు.

Latest News

 
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM
మిస్‌ ఉత్తరాంధ్రగా నిధి చౌదరి Tue, Jul 05, 2022, 11:47 AM
నా వెనుక ఉన్నదీ ఆయనే Tue, Jul 05, 2022, 11:46 AM
కర్నూల్ కి చేరుకున్న సీఎం జగన్ Tue, Jul 05, 2022, 11:39 AM