23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు

by సూర్య | Wed, Jun 22, 2022, 01:26 AM

జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఈ నెల 23 నుంచి 29 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో, మొదటి విడత హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దేశంలో 501 నగరాలతో పాటు, విదేశాల్లోని 21 నగరాల్లో జేఈఈ మెయిన్ నిర్వహిస్తుండడం విశేషం. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) అన్ని ఏర్పాట్లు చేసింది.  జేఈఈ పరీక్షలపై ఎన్టీయే స్పందిస్తూ... హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అంశంలో ఏవైనా సమస్యలు తలెత్తితే 011-40759000 ఫోన్ నెంబరులో గానీ, jeemain@nta.ac.in మెయిల్ ద్వారా గానీ సంప్రదించాలని సూచించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమకు కరోనా లక్షణాలు లేవని సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Latest News

 
ఏపీలో ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక Thu, May 02, 2024, 08:16 PM
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్రధాని మోదీ.. ఈ జిల్లాల్లో కూటమి తరఫున ఎన్నికల ప్రచారం Thu, May 02, 2024, 08:12 PM
టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ Thu, May 02, 2024, 08:03 PM
శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా Thu, May 02, 2024, 08:00 PM
ట్రావెల్స్ బస్సు లగేజీ డిక్కీలో దాచేసి..ప్లాన్ మొత్తం రివర్స్ Thu, May 02, 2024, 07:56 PM