అమ్మకాల్లో కియా రికార్డు...ఎన్ని వాహనాలను అమ్మిందో తెలుసా

by సూర్య | Wed, Jun 22, 2022, 01:25 AM

దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా సంస్థకు సంబంధించి మన దేశంలో ఇప్పటిదాకా అమ్ముడైన కియా సోనెట్ కార్ల సంఖ్య 1.5 లక్షలు దాటింది.  కియా భారత్ లో కాలుమోపిన కొన్ని సంవత్సరాల్లోనే గణనీయమైన పురోగతి సాధించింది. సెల్టోస్, సోనెట్, కార్నివాల్, కరెన్స్ వంటి మోడళ్లతో కియా భారత మార్కెట్ లో తన వాటా పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. 


ఈ క్రమంలో కియా సోనెట్ అమ్మకాల పరంగా మరో మైలురాయిని అధిగమించింది. దేశంలో ఇప్పటిదాకా అమ్ముడైన కియా సోనెట్ కార్ల సంఖ్య 1.5 లక్షలు దాటింది. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ 2020 సెప్టెంబరులో భారత విపణిలో అడుగుపెట్టింది. కియా అన్ని మోడళ్ల విక్రయాల్లో సోనెట్ వాటా 32 శాతం అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సెల్టోస్ తర్వాత అత్యధికంగా అమ్మకాలు నమోదు చేస్తున్న మోడల్ ఇదే. మార్కెట్లోకి వచ్చిన 9 నెలల్లోనే ఇది లక్ష మార్కు చేరుకోవడం విశేషం.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM