దాచేప‌ల్లి సిమెంట్ ప్లాంట్ విస్త‌ర‌ణ...ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

by సూర్య | Wed, Jun 22, 2022, 01:20 AM

శ్రీ సిమెంట్ లిమిటెడ్‌ తన ప్లాంట్ విస్తరించేందుకు గానూ ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో ఇప్ప‌టికే సిమెంట్ త‌యారీ ప్లాంట్‌ను క‌లిగి ఉన్న శ్రీ సిమెంట్ లిమిటెడ్‌ తాజాగా రాష్ట్రంలో మ‌రో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప‌ల్నాడు జిల్లా ప‌రిధిలోని దాచేప‌ల్లిలో ఇప్ప‌టికే ఆ సంస్థ‌కు ఓ సిమెంట్ త‌యారీ యూనిట్ ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ ప్లాంట్‌ను భారీ ఎత్తున విస్త‌రించేందుకు శ్రీ సిమెంట్ ప్ర‌తిపాదించ‌గా... అందుకు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి తెలిపింది. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రావ‌డంతో ఏపీలో త‌న తాజా పెట్టుబ‌డుల‌కు సంబంధించి శ్రీ సిమెంట్ మంగ‌ళవారం ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం దాచేప‌ల్లి ప్లాంట్ విస్త‌ర‌ణ కోసం శ్రీ సిమెంట్ ఏకంగా రూ.2,500 కోట్ల మేర పెట్టుబ‌డి పెట్ట‌నుంది.

Latest News

 
నేడు ఆధార్ కేంద్రం ప్రారంభం Fri, Jul 01, 2022, 09:34 AM
'చెంచు గిరిజనుల అభివృద్ధి ఎక్కడ' Fri, Jul 01, 2022, 09:33 AM
నువ్వుల పంటలో సస్యరక్షణ Fri, Jul 01, 2022, 09:31 AM
నేటి నుంచి కబడ్డీ పోటీలు Fri, Jul 01, 2022, 09:30 AM
నేటి నుంచి భోజన పథకం: సీడీపీఓ Fri, Jul 01, 2022, 09:29 AM