వేతనాల కోసం నినాదించిన సినీ కార్మికలోకం...నేటి నుంచి షుటింగ్ లు బంద్

by సూర్య | Wed, Jun 22, 2022, 01:18 AM

తమ శ్రమకు దగ్గ వేతనాల కోసం సినీ కార్మికలోకం గర్జించింది. నిర్మాతలు దిగిరాకపోవడంతో సినీ కార్మికలోకం సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించింది. దీంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ టాలీవుడ్‌లో బుధ‌వారం నుంచి సినిమా షూటింగ్‌లు నిలిచిపోనున్నాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం తెలుగు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సినీ కార్మికుల‌కు వేత‌నాలు పెంచాలంటూ 24 విభాగాల‌కు చెందిన సిబ్బంది స‌మ్మె బాట ప‌ట్టేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ స‌మ్మె కార్య‌రూపం దాల్చ‌కుండా ఉండేలా నిర్మాత‌ల మండ‌లి స‌హా ప‌లు సంఘాలు మంగ‌ళ‌వారం య‌త్నించాయి. స‌మ్మె ప్ర‌తిపాదించిన విభాగాల సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపాయి.


అయితే ఈ చ‌ర్చ‌లు మంగ‌ళ‌వారం సాయంత్రం దాకా కొన‌సాగినా... ఫ‌లించ‌లేదు. చర్చ‌లు విఫ‌ల‌మైన నేప‌థ్యంలో రేప‌టి నుంచే తెలుగు సినిమా షూటింగ్‌ల‌ను బంద్ చేస్తున్న‌ట్లు తెలుగు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ప్ర‌క‌టించింది. కార్మికుల వేత‌నాల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకునేదాకా స‌మ్మె విర‌మించేది లేద‌ని కూడా ఫెడ‌రేష‌న్ తేల్చి చెప్పింది. వేత‌న స‌వ‌ర‌ణ జ‌రిగేదాకా కొన‌సాగ‌నున్న స‌మ్మెలో 24 విభాగాల‌కు చెందిన కార్మికులు పాలుపంచుకుంటార‌ని ఫెడ‌రేష‌న్ ప్ర‌క‌టించింది.

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM