సూర్యుడిని బందించేందుకు జనం ఎగబడ్డారు

by సూర్య | Wed, Jun 22, 2022, 01:17 AM

సూర్యుడిని నేరుగా చూడాలంటేనే ఓ సాహసం..అలాంటి సూర్యడిని బంధించడం సాధ్యమా అంటే సాధ్యమేనని నిరూపించారు న్యాయర్క్ నగర ప్రజలు. ఆకాశంలో అందమైన కాంతులు విరజిమ్మే సూర్యాస్తమయాన్ని ఇష్టపడని వారెవ్వరుంటారు! చేతిలో కెమెరా, ఫోన్ ఉంటే చాలు... పడమటివైపుకి జారిపోతున్న ఆ 'సంధ్య'వేళ అందాలను బంధించేందుకు ప్రయత్నిస్తుంటారు. న్యూయార్క్ నగరంలోనూ అదే జరిగింది.  మన్ హట్టన్ ప్రాంతంలో సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తున్న క్షణాలు అద్భుతంగా గోచరించాయి. ఆకాశంలో పరుచుకున్న కనువిందు చేసే కాంతులను చూసి వాహనాల్లో వెళ్లేవారు సైతం తమ కెమెరాలకు పనిచెప్పారు. దాంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయి, జనాలతో రోడ్లు రద్దీగా మారాయి. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ పట్టుకుని సాయంసంధ్యను చిత్రీకరించడం మొదలుపెట్టారు. 


ఈ నేపథ్యంలో, అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జనాలు మాత్రం ఇవేవీ పట్టకుండా, సూర్యాస్తమయ సోయగాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి సారించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

Latest News

 
జూన్‌ 9న కాకినాడ జిల్లా అరసం మహాసభ Thu, May 16, 2024, 09:03 PM
ఒంగోలులో పోలింగ్ ఎంతంటే? Thu, May 16, 2024, 09:01 PM
మాకు జీతాలు చెల్లించండి Thu, May 16, 2024, 09:00 PM
వైభవంగా కొనసాగుతున్న ‘గంగమ్మ జాతర' Thu, May 16, 2024, 08:59 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Thu, May 16, 2024, 08:58 PM