మార్కెట్ లోకి త్వరలో శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్ 13 స్మార్ట్ ఫోన్

by సూర్య | Tue, Jun 21, 2022, 11:59 PM

శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్ 13 స్మార్ట్ ఫోన్ ఎఫ్13 6.6 అంగుళాల పరిమాణంతో ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో, నాచ్ డిజైన్ తో రాబోతోంది. ఈ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆన్ లైన్ లో దీన్ని నిర్వహించనున్నారు. యూట్యూబ్ ఛానల్, కంపెనీ వెబ్ సైట్లో ప్రసారం చేసే ఏర్పాట్లు చేశారు. ఫ్లిప్ కార్ట్ తోపాటు, శామ్ సంగ్ వెబ్ సైట్ లో  ఈ ఫోన్ విక్రయానికి రానుంది. 


ఎఫ్13 6.6 అంగుళాల పరిమాణంతో ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో, నాచ్ డిజైన్ తో ఉంటుంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ చార్జర్ తో రానుంది. ఆటో డేటా స్విచింగ్ సదుపాయంతో వస్తున్న తొలి ఫోన్ ఇది. పింక్, గ్రీన్, బ్లూ రంగుల్లో లభించనుంది. కంపెనీ అధికారికంగా ఫీచర్ల గురించి ప్రకటించలేదు. కానీ, వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం బయటకు వచ్చింది. 


ఎక్సినోస్ 850 ప్రాసెసర్ ను శామ్ సంగ్ ఈ ఫోన్లో వినియోగించినట్టు సమాచారం. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్ తో వచ్చే దీని ధర సుమారు రూ.12,000. 

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM