మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన ఇమ్రాన్ ఖాన్

by సూర్య | Sun, May 22, 2022, 02:48 PM

కేంద్రంలోని మోడీ సర్కార్ పై దేశంలోని వివిధ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే  దాయాది దేశమైన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం ప్రశంసలతో మంచెత్తారు. గతంలోనూ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించిన ఇమ్రాన్ ఖాన్ తాజాగా పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడాన్ని ప్రశంసించారు. ఇదే విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావిస్తూ.. అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుంచి రాయితీపై చమురు కొనుగోలు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుందని అన్నారు. భారతదేశం ‘క్వాడ్’లో భాగమైనప్పటికీ యూఎస్‌ నుంచి ఒత్తిడి ఎదుర్కొని ప్రజల కోసం రాయితీపై రష్యన్ చమురును కొనుగోలు చేసిందంటూ ఇమ్రాన్ ట్వీట్ చేశారు. 


పాకిస్థాన్‌లోని తమ ప్రభుత్వం కూడా ఇది సాధించేందుకు కృషి చేసిందని అన్నారు. స్వతంత్ర విదేశాంగ విధానం సాయంతో తమ ప్రభుత్వం కూడా కృషి చేసిందన్నారు. అలాగే, పాకిస్థాన్ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) నేతృత్వంలోని ప్రభుత్వం ‘ఆర్థిక వ్యవస్థతో తల లేని కోడి’లా నడుస్తోందని దుయ్యబట్టారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM