ఎక్సైజ్ సుంకాన్నితగ్గించిన కేంద్రం...దిగిరానున్న పెట్రోల్ ధరలు

by సూర్య | Sat, May 21, 2022, 09:22 PM

దేశంలోని సామాన్య ప్రజలకు కాస్త ఊరాటనిచ్చే నిర్ణయం కేంద్రం తీసుకొంది. పెట్రోల్ , డీజీల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఇదిలావుంటే దేశంలో గత కొన్నాళ్లుగా పెట్రో ధరలు పైపైకి దూసుకెళ్లడం తెలిసిందే. పెట్రోల్ లీటర్ రూ.120 వరకు ఉండగా, డీజిల్ లీటర్ రూ.105 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తద్వారా లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 మేర తగ్గనుందని, లీటర్ డీజిల్ ధర రూ.7 మేర తగ్గనుందని వివరించారు. ఇటీవల మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 మధ్య కాలంలో పెట్రో ధరలను 14 సార్లు పెంచారు. తద్వారా లీటర్ పై గరిష్ఠంగా రూ.10 వరకు పెరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులకు ఊరట కలగనుంది.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM