మీరే కూల్చేసుకొంటారా లేక మేం కూల్చాలా: ఎంపీ నవనీర్ కౌర్ కు నోటీసులు

by సూర్య | Sat, May 21, 2022, 09:21 PM

అక్ర‌మ నిర్మాణాన్ని వారంలోగా కూల్చేయాల‌ని, లేనిప‌క్షంలో తామే ఆ ప‌నిని చేప‌ట్టాల్సి వ‌స్తుంద‌ని ఎంపీ నవనీర్ కౌర్ కు న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు జారీచేసిన నోటీసుల్లో హెచ్చ‌రించారు. దీంతో హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నంపై రేకెత్తిన వివాదంలో అరెస్టై ఇటీవ‌లే జైలు నుంచి విడుద‌లైన అమ‌రావ‌తి ఎంపీ న‌వ‌నీర్ కౌర్‌, ఎమ్మెల్యే ర‌వి రాణా దంప‌తుల‌కు శ‌నివారం మ‌రో షాక్ త‌గిలినట్లైంది. ముంబై న‌గ‌రంలోని ఖర్ ప‌రిధిలోని కౌర్ ఇంటిలో కొంత భాగం అక్ర‌మంగా నిర్మించిన‌దేన‌ని తెలిపిన ముంబై నగ‌ర పాల‌క సంస్థ ఆమెకు నోటీసులు జారీ చేసింది. 


ఇదిలావుంటే మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే హ‌నుమాన్ చాలీసా ప‌ఠించాల‌ని డిమాండ్ చేసిన కౌర్‌.. అందుకు ఆయ‌న స‌మ్మ‌తించ‌క‌పోతే.. ఆయ‌న ఇంటి ముందు తామే హ‌నుమాన్ చాలీసాను ప‌ఠిస్తామంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో గ‌త నెల‌లో సీఎం ఇంటికి వెళతార‌న్న అనుమానంతో పోలీసులు కౌర్‌తో పాటు ఆమె భ‌ర్త ర‌వి రాణాను కూడా అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌ది రోజుల త‌ర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో కౌర్ దంప‌తులు జైలు నుంచి విడుద‌ల‌య్యారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM