మామిడితో రుచియే కాదు..ఆరోగ్య ప్రయోజనాలు కూడా

by సూర్య | Sat, May 21, 2022, 07:27 PM

నోరురించే మామిడి పండ్లు అంటే ఎవరికి ఇష్టముండదు. మామిడి పండ్ల రుచియే కాదు దాని ఆరోగ్య ప్రయోజనాలు కూడా అద్భుతమే. మామిడి కాయ క్రమం తప్పకుండా తీసుకుంటే.. కేన్సర్‌, కొలెస్ట్రాల్, అధిక బరువు, , కంటి సమస్యలు దూరమవుతుతాయని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. మామిడి పండు మాత్రమే కాదు.. మామిడి టెంకలోనూ ఎన్నో పోషక విలువలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మామిడి టెంకకు కొలెస్ట్రాల్‌, డయేరియా, గుండె సమస్యలతో పోరాడగల సమర్థ్యం ఉందని నిపుణులు చెబుతున్నారు.


హాట్‌.. హాట్‌ సమ్మర్‌లో దొరికే టేస్టీ..టేస్టీ మామిడి పండ్లంటే ఇష్టముండని వారుండరు. చాలా మంది మామిడి పండ్లు టేస్ట్ ఎంజాయ్‌ చేయడానికి వేసవి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే మామిడి పళ్ళకు ఉండే క్రేజ్ అలాంటిది. మామిడి పండు టేస్ట్‌లోనే కాదు పోషకాలలోనూ కింగే.. ఈ పండులో విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.


డయేరియా సమస్యను నివారించడానికి.. మామిడి టెంకలోని.. గింజ సమర్థవంతంగా పనిచేస్తుంది. మామిడి టెంకలో ఉండే గింజను ఎండబెట్టి.. దాన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. మీరు ఒక గ్లాసులో నీరు తీసుకుని ఒక గ్రాము కంటే ఎక్కువ మామిడి జీడి పౌడర్‌ వేయ్యాలి. దానిలో కొంచెం తేనె వేసుకుని తాగితే.. డయేరియా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక గ్రాము కంటే ఎక్కువగా జీడి పొడి తీసుకుంటే మంచిది కాదు.


మామిడి జీడి రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. తద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. మామిడి గింజల పొడిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మామిడి జీడి పొడి రక్తంలోని చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది. మామిడి గింజల పొడిని తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఈ పొడి వేసి నీళ్లు తాగితే.. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. మామిడి జీడి పొడి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు తక్కువ మొత్తంలో ఈ పొడి తీసుకుంటే మంచిది.


ఎసిడిటీ సమస్యతో తరచూ ఇబ్బంది పడే వారికి మామిడి జీడీ పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది.మామిడి జీడిలో ఫినాల్స్, ఫినాలిక్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. మామిడి జీడిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో మామిడి జీడి పౌడర్‌ తీసుకోవడానికి సహాయపడుతుంది. మామిడి జీడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మామిడి గింజల పొడి స్కర్వీ రోగులకు ఒక మేజిక్ రెమెడీలా పనిచేస్తుంది. ఒక భాగం మామిడి జీడి పొడిని, రెండు భాగాల బెల్లం, కొంచెం సున్నంతో కలిపి దానిని తినండి.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM