ఒక్కేచోట కూర్చుండిపోకండి...కదలికలతోనే ఆరోగ్యం

by సూర్య | Sat, May 21, 2022, 03:24 PM

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అందుకే  నేడు ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ తప్పిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు మన చేతులారా కూడా మనం తెలియక పాడుచేసుకొంటున్నాం. అదేలాగంటే కదలికలు పెద్దగా లేని జీవనశైలితో ఆరోగ్యపరమైన ముప్పు ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొద్ది మందికే. అందుకని శరీరానికి తగినంత కదలికలు ఉండేలా చూసుకోవాలి. శారీరకంగా తగినంత కదలికల్లేని వారు, అలానే కొనసాగి ముప్పు తెచ్చుకోవడం ఎందుకు..? కనీసం వీలైనంత సమయం నడవడం, ఇతర కసరత్తులు చేయాలి. కదలికల్లేని సమయాన్ని వీలైనంత మేర తగ్గించుకోగలిగితే చాలు.ఇలా చేస్తే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని.. జర్నల్ఆఫ్ సైన్స్ అండ్ మెడిసిన్ లో ప్రచురితమైన తాజా అధ్యయనం చెబుతోంది. 


నిశ్చలమైన జీవనాన్ని రోజులో గంట తగ్గించలిగినా ఎంతో కొంత ఆరోగ్యానికి మంచి జరుగుతుందని ఈ అధ్యయనంలో తెలుసుకున్నారు. గుండె ఆరోగ్యం, టైప్-2 డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. పరిశోధకులు ఫిన్లాండ్ లో మధ్య వయసులో నిశ్చిలమైన జీవనాన్ని గుడుపుతున్న 64 మందిని (మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారు) ఎంపిక చేశారు. రెండు గ్రూపులుగా చేశారు. 


ఒక గ్రూపులోని వారికి నిత్యం గంటపాటు కదలికలు ఉండేలా చూశారు. నించోవడం, అటూ ఇటూ కదలడం, స్వల్ప వ్యాయామాల్లాంటివి చేయించారు. మూడు నెలల పాటు పరిశీలించారు. రక్తపోటు, రక్తంలో గ్లూకోజును కూడా చెక్ చేశారు. దీంతో కదలికల్లేని గ్రూపులోని వారితో పోలిస్తే.. కనీసం గంటపాటు శారీరకంగా శ్రమించే వారికి బ్లడ్ షుగర్ నియంత్రణ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు తెలుసుకున్నారు. 

Latest News

 
పోలీసుల సమక్షంలోనే కొట్టారు... మంత్రి జోగి రమేష్ Mon, May 13, 2024, 09:16 PM
రేపు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్,,,,పవన్ కల్యాణ్ కు ఆహ్వానం Mon, May 13, 2024, 09:15 PM
గ్లాసు గుర్తుకు ఓటు వేయమంటే, ఫ్యాన్ గుర్తుకు వేశారు.. 'నా ఓటు నాకు కావాల్సిందే'.. ఓటరు గొడవ Mon, May 13, 2024, 08:59 PM
బౌన్సర్లతో వచ్చిన టీడీపీ అభ్యర్థి.. వైసీపీ అభ్యంతరం, హై టెన్షన్ Mon, May 13, 2024, 07:45 PM
కదం తొక్కిన ఏపీ ఓటర్లు.. రికార్డు స్థాయిలో పోలింగ్ Mon, May 13, 2024, 07:41 PM