అమ్మో టమోటా..కిలో రూ.100కి చేరువలో

by సూర్య | Sat, May 21, 2022, 03:11 PM

టమోటా లేనిది ఏ కూరాకు రుచిరాదు.  అలాంటి టమెటాను తినాలంటే  ప్రస్తుతం వంద సార్లు ఆలోచించాల్సి వస్తోంది. దీనికి కారణం టమాటా ధరకు ఒక్కసారిగా రెక్కలు రావడమే. మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం గరిష్ఠంగా కిలో రూ.88 వరకు పలికింది. ఈ సీజన్‌లో మార్చి నెలాఖరులో తక్కువగా ఉన్న ధరలు వారం రోజులుగా పెరుగుతున్నాయి. మార్కెట్‌కు సరకు తక్కువగా వస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎండలతో దిగుబడి తగ్గడం వల్ల మార్కెట్‌కు రైతులు తక్కువగా తీసుకొస్తున్నారు. మదనపల్లె నుంచి రాష్ట్రంలోని నగరాలతో పాటు తమిళనాడులోని చెన్నై, కుంభకోణం, కేరళ రాష్ట్రంలోని పలు నగరాలకు టమాటాలను ఎగుమతి చేస్తున్నారు.

Latest News

 
మహిళలకు అండగా నిలిచింది జగన్ ప్రభుత్వమే Mon, Apr 29, 2024, 12:36 PM
ప్రజాదారణ ఓర్వలేక ప్రచార రథంపై రాళ్లు రువ్విన వైసీపీ మూకలు Mon, Apr 29, 2024, 12:34 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం సతీమణి Mon, Apr 29, 2024, 12:34 PM
నేడు పి.గన్నవరంలో పర్యటించనున్న సీఎం జగన్ Mon, Apr 29, 2024, 12:33 PM
చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని నిద్రలేపినట్లే: సీఎం Mon, Apr 29, 2024, 12:29 PM