పెద్దరు నదీ ప్రవాహంలో వృద్ధుడు గల్లంతు

by సూర్య | Sat, May 21, 2022, 02:10 PM

చోడవరం పెద్దరు నదీ ప్రవాహంలో ఒక వృద్ధుడు గల్లంతయ్యాడు. చెక్కలతో నిర్మించిన కాలి వంతెన ఒక్కసారిగా నదిలో కూరుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వృద్ధుడి కోసం పోలీసు, ఎసీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బెన్నవోలుకు చెందిన మజ్జి అచ్చెంనాయుడు (61), అతని కుమారుడు మజ్జి ప్రసాద్శుక్రవారం పెద్దేరు అవతల ఉన్న పీఎస్పేట వెళ్లారు. అక్కడ పని ముగించుకొని తిరిగి వస్తూ బెన్నవోలు గ్రామ సమీపంలో పెద్దరు నదిపై తాత్కాలికంగా వేసిన తాటిచెక్కల వంతెనపై నదిని దాటుతున్నారు. ఈ క్రమంలో నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతోపాటు తాటిచెక్కల వంతెన అప్పటికే శిథిలమైపోయి ఉండటం వల్ల కూలిపోయింది. వంతెన దాటుతున్న తండ్రీ కొడుకులిద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొడుకు ప్రసాద్కు ఈత రావడంతో ఒడ్డుకు క్షేమంగా చేరాడు. తండ్రిని రక్షించేందుకు చూడగా అప్పటికే అచ్చెంనాయుడు గల్లంతయ్యాడు. స్థానికులు, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది నదిలో పొద్దుపోయే వరకు వెతికినా ఫలితం లేకపోయింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM