ఇక 'బట్టతలోడు' అని పిలిస్తే.. లైంగిక వేధింపు కేసు..!

by సూర్య | Sat, May 14, 2022, 03:24 PM

ఇక బట్టతలోడు అని పిలిస్తే లైంగిక వేధింపుల కేసు నమోదయ్యే అవకాశం ఉంది జాగ్రత్త. తాజాగా అలాంటి కేసే ఒకటి నమోదైంది. ఇంగ్లండ్‌ లోని వెస్ట్ మార్క్‌షైర్‌లో బ్రిటిష్ బంగ్ మాన్యుఫ్యాక్చరింగ్ అనే కంపెనీలో టోనీ ఫిన్ అనే వ్యక్తి ఎలక్ట్రీషన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి బట్టతల ఉండటం వల్ల కంపెనీ ఉద్యోగులంతా అతడిని ఎగతాళి చేస్తుండేవారు. సూపర్ వైజర్లు అయితే అతడి బట్టల మీద జోకులు వేస్తూ బాగా వేధించేవారు. అలా ఉద్యోగం చేస్తూ మాటలు పడుతున్న అతన్ని ఓ రోజు తన కంపెనీ ఉద్యోగంలోంచి తీసేసింది. అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించడంతో 24 ఏళ్ల పాటు ఎలక్ట్రీషన్‌గా పనిచేసిన టోనీ ఫిన్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.


ఈ నేపథ్యంలోనే కంపెనీ తీరుపై షెఫీల్డ్‌లోని ఎంప్లాయ్‌మెంట్ ట్రైబ్యునల్‌లో దావా వేసి తన బాధను చెప్పుకున్నాడు. ఆ పిటిషన్‌పై ట్రిబ్యునల్ విచారించింది. తలపై జుట్టు తక్కువగా ఉందన్న కారణంగా కార్యాలయాల్లో పనిచేసే పురుషులను 'బట్టతల' పేరుతో పిలవడం అన్న అంశంపై షెఫీల్డ్ కు చెందిన ఎంప్లాయ్ మెంట్ ట్రైబ్యునల్ లో వాదోపవాదాలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో దీనిపై తీవ్ర చర్చ జరిగింది. న్యాయమూర్తి జోనాథాన్ బ్రెయిన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల విచారించారు. బట్టతల సమస్య వల్ల పురుషులే ఎక్కువగా వేదన అనుభవిస్తున్నారని, అందువల్ల దానిని లైంగిక వేధింపుగా పరిగణించాల్సి ఉందని తేల్చింది. సదరు కంపెనీ ఆ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆ తీర్పు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Latest News

 
పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నేచురల్ స్టార్ నాని Tue, May 07, 2024, 09:09 PM
ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై ఓటరు ఫోటో బదులు క్యూఆర్ కోడ్ Tue, May 07, 2024, 09:02 PM
ఏపీలో దంచికొట్టిన వాన.. రేపు ఈ జిల్లాలలో భారీవర్షాలు.. అక్కడ పిడుగులు పడే ఛాన్స్ Tue, May 07, 2024, 08:58 PM
రాయలసీమలో ట్రెండ్‌ సెట్ చేసే ఏకైక జిల్లా అనంతపురం.. బరిలో ఉన్న అభ్యర్థులు వీరే Tue, May 07, 2024, 08:32 PM
అంబటి వ్యాఖ్యలకు కౌంటర్‌గా మరో వీడియో వదిలిన అల్లుడు.. ఈసారి మరింతగా Tue, May 07, 2024, 08:26 PM