భూములను వైసీపీ వాళ్ళు కబ్జాలు చేస్తున్న విషయం జగన్ రెడ్డికి తెలియదా?

by సూర్య | Sat, May 14, 2022, 11:33 AM

గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల చేత చీత్కారాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసి... పరిపాలన చేతగాని సి.బి.ఐ. దత్తపుత్రుడయిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైంది. నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పడమే ఆయనకు తెలిసిన విద్య. పాదయాత్రలో ముద్దులు పెడుతూ నోటికొచ్చిన హామీలు గుప్పించి, మేనిఫెస్టోలో ఎడాపెడా చెప్పేసి తీరా వాటి గురించి అడిగితే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు అని జనసేన నాయకులూ నాదెండ్ల మనోహర్ అన్నారు.ప్రభుత్వం చేస్తున్న గడప గడప కి మన ప్రభుత్వం మీద ఆయన స్పందిస్తూ....  ఇప్పుడేమో 95 శాతం హామీలు నెరవేర్చాను అని మరో పెద్ద అబద్ధం చెప్పారు. రాష్ట్రంలో మత్స్యకార భరోసాకు అర్హత ఉన్న కుటుంబాల్ని కూడా ఎందుకు పథకానికి దూరం చేశారో చెప్పాలి. 2021లో 1లక్ష 19వేల మందికి ఇస్తున్నామని చెప్పారు. 2022లో ఆ సంఖ్య లు 8 వేలకు తగ్గించిన మాట వాస్తవం కాదా? జీవో 217 ద్వారా మత్స్యకారులను చేపల చెరువులకు ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలి. మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ గారి పేరు పలికి అర్హత సి.బి.ఐ. దత్తపుత్రుడికి ఉందా? అని ప్రశ్నించారు.  ఆయన దానం చేసిన ఆస్తులను, భూములను వైసీపీ వాళ్ళు కబ్జాలు చేస్తున్న విషయం జగన్ రెడ్డికి తెలియదా? ఎం.ఎస్.ఎన్. ఛారిటీస్ కి సంబంధించిన భూమి తీసేసుకొని వైసీపీ జిల్లా పార్టీ ఆఫీస్ నిర్మించడానికి సిద్ధమైనవాళ్ళా ఆ మహాదాత గురించి చెప్పేది  అని హెచ్చరించారు  .


వైసీపీలో మేనిఫెస్టోలో చెప్పిన మద్య నిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలి. ఊరూరా మద్యం ఏరులై పారుతోంది. ప్రతి యేటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ యువతను మభ్యపెట్టారు. ఈ మూడేళ్లలో ఇచ్చింది ఒక క్యాలెండర్... అదీ అరకొర ఉద్యోగాలు. వాటికి ఇప్పటికీ నోటిఫికేషన్లు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు సి.పి.ఎస్. రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకొస్తామని మాట తప్పారు. అవగాహన లేక ఆ హామీ ఇచ్చామని సకల శాఖల మంత్రితో చెప్పించి మోసం చేసిన విషయాన్ని ఒప్పుకొన్నారు. ఆత్మహత్య చేసుకొన్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు రూ.7 లక్షలు ఇస్తామని చెప్పి... వాటిని ఎగొట్టే పనిలో ఉన్నారు. • పారిశ్రామికవేత్తలు ఇటు చూడటం లేదు వైసీపీ దారుణ పాలన చూసే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఉన్న పరిశ్రమలు కూడా మూసేసుకొని పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. విద్యుత్ సంక్షోభం, రోడ్ల దుస్థితి కళ్ళెదుట కనిపిస్తున్నాయి. ఈ విషయాల గురించి ప్రజలు నిలదీస్తుంటే జగన్ రెడ్డి సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. మరో వైపు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తుంటే వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. సి.బి.ఐ. దత్తపుత్రుడు, ఆయన అనుచరులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. చేతనైతే బాధల్లో ఉన్న రైతాంగం కన్నీరు తుడవండి. సి.పి.ఎస్. రద్దు చేయండి. పెట్టుబడులు తీసుకురండి.. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. అర్థం పర్థం లేని విమర్శలు కట్టిపెట్టకపోతే ప్రజలే బలంగా సమాధానం చెబుతారు అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

Latest News

 
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోకి... కేటుగాళ్లు... గుప్తనిధుల కోసమేనా Thu, May 19, 2022, 08:27 PM
కరోనా కంటే ప్రమాదకరంగా జగన్ పాలన: చంద్రబాబు నాయుడు Thu, May 19, 2022, 08:26 PM
జీపు బోల్తా పడి ఒకరు మృతి Thu, May 19, 2022, 05:09 PM
ఖరీఫ్ పంట సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఉష శ్రీ Thu, May 19, 2022, 05:05 PM
సమ్మర్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి రోజా Thu, May 19, 2022, 05:03 PM