మంత్రి విడదల రజినీ దారుణంగా వ్యవహరిస్తుoది: ప్రత్తిపాటి పుల్లారావు

by సూర్య | Fri, May 13, 2022, 08:38 PM

అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి విడదల రజినీ దారుణంగా వ్యవహరిస్తుoది అని, మంత్రి రజినీ విడుదలపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని తాగునీటి చెరువు వద్ద గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ ట్రస్టు సౌజన్యంతో సుమారు రూ.7 కోట్లతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల ప్లాంట్ పునఃప్రారంభోత్సవానికి విచ్చేసిన పుల్లారావు. పోలీసులు, మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు.

దీంతో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. పోపూరి చందు అనే టీడీపీ కార్యకర్త సహా పలువురు నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పేదలకు అందుబాటు ధరల్లో మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ఎన్టీఆర్ సుజల ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ఏర్పాటుచిన ప్లాంటు మినహా మిగిలిన అన్ని ప్లాంట్లు నడుస్తున్నాయన్నారు. పేదలకు సురక్షితనీరు అందిస్తామంటే మంత్రి రజినీకి ఎందుకు అంత బాధ అని పుల్లారావు ప్రశ్నించారు.

Latest News

 
టమాటా ధరలుపై ఏపీ సర్కర్ కీలక నిర్ణయం Thu, May 19, 2022, 08:38 PM
రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధం: చంద్రబాబు నాయుడు Thu, May 19, 2022, 08:34 PM
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోకి... కేటుగాళ్లు... గుప్తనిధుల కోసమేనా Thu, May 19, 2022, 08:27 PM
కరోనా కంటే ప్రమాదకరంగా జగన్ పాలన: చంద్రబాబు నాయుడు Thu, May 19, 2022, 08:26 PM
జీపు బోల్తా పడి ఒకరు మృతి Thu, May 19, 2022, 05:09 PM