యాదాద్రిలో జయంతి ఉత్సవాలు మొదటి రోజు

by సూర్య | Fri, May 13, 2022, 03:54 PM

పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమైనాయి. శుక్రవారం 13వతేది నుంచి 15 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలను ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవాచనంతో ఘనంగా ప్రారంభించారు అర్చకులు. జయంతి ఉత్సవాల్లో మొదటిరోజైన ఇవాళ తిరువెంకటపతి అలంకార సేవలో ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు అంతకుముందు ఆలయంలో స్వస్తివాచనంతో జయంతి ఉత్సవాలను శాస్త్రోత్తంగా ప్రారంభించిన అర్చకులు, స్వామివారికి కుంకుమార్చన నిర్వహించారు. ముందు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రుత్విక్ వరణం, రక్షాబంధనం నిర్వహించారు. రెండోరోజైన రేపు కాళీయమర్థని అవతారం, రామావతారం, లక్షకుంకుమార్చన నిర్వహించనున్నారు అర్చకులు. జయంతి ఉత్సవాల్లో చివరి రోజైన 15న సహస్ర ఘటాభిషేకంతో ఉత్సవాలను పరిసమాప్తి పలకనున్నారు ఆలయ అర్చకులు

Latest News

 
పోలీసుల సమక్షంలోనే కొట్టారు... మంత్రి జోగి రమేష్ Mon, May 13, 2024, 09:16 PM
రేపు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్,,,,పవన్ కల్యాణ్ కు ఆహ్వానం Mon, May 13, 2024, 09:15 PM
గ్లాసు గుర్తుకు ఓటు వేయమంటే, ఫ్యాన్ గుర్తుకు వేశారు.. 'నా ఓటు నాకు కావాల్సిందే'.. ఓటరు గొడవ Mon, May 13, 2024, 08:59 PM
బౌన్సర్లతో వచ్చిన టీడీపీ అభ్యర్థి.. వైసీపీ అభ్యంతరం, హై టెన్షన్ Mon, May 13, 2024, 07:45 PM
కదం తొక్కిన ఏపీ ఓటర్లు.. రికార్డు స్థాయిలో పోలింగ్ Mon, May 13, 2024, 07:41 PM