మీ దగ్గర బ్యాంకు కు వెళ్ళండి ...చిరిగిపోయిన నోట్లు మార్చుకోండి

by సూర్య | Wed, Jan 19, 2022, 08:34 PM

చిరిగిపోయిన నోట్ల బెంగ ఇక అవసరం లేదు. ఎందుకంటే ఈ నోట్ల మార్పిడికి క ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలోని బ్యాంకు బ్రాంచ్ కి వెళ్తే చాలు చిరిగిపోయిన గ్రూప్ లో మార్పు చేయబడతాయి. చినిగిపోయిన రూ.50 నోటు, రూ.2000 నోటు ఉన్నాయా... ? అయ్యో నోట్లు చినిగిపోయాయే అని బాధపడ్డాల్సినవసరం లేదు. మీ దగ్గర్లో ఉన్న ఏ బ్యాంకు బ్రాంచ్‌కైనా వెళ్లి ఈ నోట్లను మార్చుకోవచ్చు. అయితే ఈ నోట్లను మార్చినందుకు మీకు ఎంత మనీ లభిస్తుందో ఇక్కడ ఓసారి తెలుసుకుందాం. చినిగిపోయిన నోట్ల కోసం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నోట్ రీఫండ్ రూల్స్, 2009లో ఎన్నో మార్పులు చేసింది. ఈ రూల్స్ ప్రకారం ప్రజలు చినిగిపోయిన లేదా పాడైపోయిన నోట్లను ఆర్‌బీఐ కార్యాలయాల్లో లేదా వాటి కోసం నియమింపబడ్డ బ్యాంక్ బ్రాంచ్‌లలో మార్చుకోవచ్చు. అయితే బ్యాంకు ఉద్యోగులు ఈ నోట్ల ఎక్స్చేంజ్‌ను తిరస్కరించకూడదు. చినిగిపోయిన నోట్ల ఎక్స్చేంజ్ విషయంలో అన్ని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. బ్రాంచ్‌లలో ఈ ఫెసిలిటీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, బోర్డులు పెట్టాలని కూడా తెలిపింది. ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం, ఒకవేళ 2000 రూపాయిల నోటు 88 స్క్వేర్ సెంటిమీటర్లలో ఉంటే మీకు పూర్తి మనీ రీఫండ్ వస్తుంది. అదేవిధంగా 44 స్క్వేర్ సెంటిమీటర్లుంటే మీకు కేవలం సగం మనీనే వస్తుంది. రూ.2000 నోటు పరిమాణంలో 109.56 చదరపు సెంటిమీటర్లుగా ఉంటుది. చినిగిపోయిన రూ.200 నోటుకి 78 చదరపు సెంటిమీటర్లకు పూర్తి రీఫండ్ వస్తుంది. 39 చదరపు సెంటిమీటర్‌కి సగం రీఫండ్ మాత్రమే వస్తుంది. ఇలా ప్రతి ఒక్క నోటుకి చినిగిపోయిన దాని ప్రకారం బ్యాంకులు నోట్ల ఎక్స్చేంజ్‌కి రీఫండ్‌ను ఇస్తున్నాయి. ఇలా చినిగిపోయిన నోట్లను బ్యాంకులలో మార్చినందుకు బ్యాంకు బ్రాంచ్‌లు మీపై ఎలాంటి ఫీజులు విధించవు. బ్యాంకులు ఉచితంగానే ఈ సర్వీసులను అందిస్తాయి. ఒకవేళ బ్యాంకులు నోట్ల ఎక్స్చేంజ్‌ను తిరస్కరిస్తే.. వాటిపై ఫిర్యాదు చేయొచ్చు. ఒకవేళ ఉద్దేశ్యపూర్వకంగానే నోట్లు చినిగిపోయాయని బ్యాంకు భావిస్తే మాత్రం ఎక్స్చేంజ్ చేసుకోవడం కుదరదు.

Latest News

 
పెనగలూరు మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ప్రచారం Fri, May 03, 2024, 12:40 PM
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 12:00 PM
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM