ఆ ఘటనకు వైసీపీ ప్రభుత్వమే కారణం

by సూర్య | Wed, Jan 19, 2022, 08:28 PM

వైసీపీ ప్రభుత్వం పై బిజెపి నేత సోము వీర్రాజు తీవ్రంగా మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటనకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డే కారణమని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో చర్చిలు, మసీదులకు నిధులు కేటాయిస్తున్నారంటూ సోము వీర్రాజు విమర్శించారు. కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలతో బుధవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆత్మకూరు ఘటనకు ముఖ్యమంత్రే కారణమని.. బీజేపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడి హేయమని సోము వీర్రాజు ఖండించారు. ఘటనకు కారణమైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పుకుంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో చర్చిలు, మసీదులకు నిధులు కేటాయిస్తూ.. పాస్టర్, మౌజమ్‌లకు జీతాలు ఇవ్వడం మతతత్వాన్ని ప్రోత్సహించడం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పాలన పూర్తిగా విఫలమైందని.. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో నిధులు ఖర్చు చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారని వీర్రాజు విమర్శించారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేయకపోతే.. సంక్షేమ పథకాలు నిలిపేస్తామని వలంటీర్లతో ప్రజలను బెదిరింపులకు గురి చేస్తుండటం సిగ్గు చేటన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు ఐదేళ్ల ప్రజలను మోసం చేయగా.. జగన్‌మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో మూడేళ్లు కాలయాపన చేశారని.. బీజేపీ అధికారం చేపట్టిన వెంటనే మూడేళ్లలో అమరావతిని రాజధానిగా నిర్మించి తీరుతామని హామీ ఇచ్చారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM