ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పాత జీతాలు ఇవ్వాలి: బండి శ్రీనివాసరావు

by సూర్య | Wed, Jan 19, 2022, 05:41 PM

ఈ రోజు విజవాడలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవో లను దగ్ధం చేసారు.  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత   బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ తో పాటు  27 శాతం ఐఆర్ తో  పాత జీతాలు ఇవ్వాలి అని డిమాండ్ చేసారు లేని పక్షం లో ఈ నెల 21 న ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసులు అందిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ దీనిపైపై వెంటనే స్పందించాలన్నారు.
11వ పీఆర్సీకి సంబంధించి అశాస్త్రీయంగా ఇచ్చిన జీవోలను వ్యతిరేకిస్తున్నామన్నారు ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. నిన్నటి రోజున ఉద్యోగులు, ఉపాధ్యాయలకు చీకటి దినంగా భావిస్తున్నామని.. సీఎం ఫిట్ మెంట్ ప్రకటించి, సీఎస్‌తో ఇతర అంశాలు మాట్లాడాలని చెప్పి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఈ కొత్త మెలికలు లేకుండా ప్రతిపాదనలు అమలు చేయాలని.. కానీ అధికారుల కమిటీ చెప్పిన విధంగా ప్రభుత్వం నిర్ణయం చేయడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రాయతీలు రద్దు చేయడం ఒక రికార్డు.. గతంలో ఎవ్వరూ ఇలా రద్దు చేసిన దాఖలాలు లేవన్నారు.

కేంద్రం పేరు చెప్పి కొత్త నిబంధనలు అమల్లోకి ఎలా తెస్తారని బొప్పరాజు ప్రశ్నించారు. 11 పీఆర్సీ అమలుకు..‌కేంద్రం విధానాలకు ఎలా ముడి పెడతారని.. ఉద్యోగుల మీద ఈ ప్రభుత్వానికి ఎటువంటి ప్రేమ లేదన్నారు. డీఏలను అడ్డు పెట్టుకుని పీఆర్సీ ప్రకటించారని..ఈ పీఆర్సీని వ్యతిరేకిస్తూ, జీవోలను రద్దు‌ చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. సానుకూల నిర్ణయం వస్తుందని తమ వంతు ప్రయత్నం చేశామని.. ఉద్యోగులకు హక్కులకు వ్యతిరేకంగా ఇచ్చిన జిఒలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇరు జేఏసీల పక్షాప పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు వెంకటేశ్వర్లు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు అందరూ ఈ పోరాటం లో పాల్గొంటారని.. ప్రజలకు జరగబోయే అసౌకర్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తి కి 49వేలు వస్తే.. కొత్త పీఆర్సీ ప్రకారం 47వేలే వస్తాయన్నారు. ఇలా ప్రతి కేడర్‌లో ఉద్యోగుల అందరూ నష్టపోతున్నారని.. డీఏలను అడ్డు పెట్టుకుని తమ ఆదాయాల్లో కోత పెట్టారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అన్యాయం చేసినందు వల్లే సమ్మె వైపు ఆలోచన చేస్తున్నామన్నారు. దుర్మార్గంగా తమ హక్కులు హరించేలా జీవోలు ఇచ్చారని.. ఎల్లుండి సమావేశంలో జేఏసీ నేతలు చర్చించి పోరాటాన్ని ప్రకటిస్తామన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM