టీనేజర్లకు కొవాగ్జిన్ వ్యాక్సినేషనే ఇవ్వాలి:భారత్ బయోటెక్ స్పష్టీకరణ

by సూర్య | Wed, Jan 19, 2022, 05:13 PM

టీనేజర్లకు కచ్చితంగా కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. దేశంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసు వారికి కరోనా వ్యాక్సిన్లు ఇస్తుండడం తెలిసిందే. అయితే, కొవాగ్జిన్ సృష్టికర్త భారత్ బయోటెక్ ఆసక్తికర ప్రకటన చేసింది. టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి అనుమతుల్లేని వ్యాక్సిన్లు ఇస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. టీనేజర్లకు కచ్చితంగా కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది. కొవాగ్జిన్ ను అనేక దశల్లో పరీక్షించి, 2 నుంచి 18 ఏళ్ల లోపు వారికి అత్యంత సురక్షితమైనదని నిర్ధారించామని భారత్ బయోటెక్ వివరించింది. భారత్ లో చిన్నారులకు ఇవ్వడానికి అనుమతి లభించిన వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఒక్కటేనని వెల్లడించింది.

Latest News

 
ఘనంగా శంకరాచార్యుల జయంతి వేడుకలు Thu, May 16, 2024, 03:07 PM
స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 144సెక్షన్ అమలు Thu, May 16, 2024, 03:02 PM
కనగానపల్లిలో కరెంట్ వైర్లు చోరీ Thu, May 16, 2024, 03:00 PM
లింగసముద్రం మండలంలో వర్షపు జల్లులు Thu, May 16, 2024, 02:00 PM
అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు సీజ్ Thu, May 16, 2024, 01:58 PM