అమ్మకాల సమయం పెంచడం సరికాదు

by సూర్య | Tue, Jan 18, 2022, 07:20 PM

ఏపీలో మద్యం అమ్మకాల సమయాన్నిపెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం అమ్మకాల సమయాన్ని ఏపీ ప్రభుత్వం మరో గంట సేపు పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారం సమయంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకు మీరు ఇచ్చిన హామీని గాలికి వదిలేసి... కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా మద్యం అమ్మకాలను ఇంకో గంట పాటు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. వెంటనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం షాపులను తెరిచి ఉంచాలని... లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM