ఎలక్ట్రిక్ వాహనదారులకు కేంద్రం శుభవార్త

by సూర్య | Mon, Jan 17, 2022, 11:26 AM

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలకు ఛార్జింగ్ సదుపాయల కల్పన విషయంలో అన్ని రాష్ట్రాల డిస్కంలకు కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ద్వారా విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాలు సులభతరం కానున్నాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం..


-ప్రజలు తమ ఇంట్లో ఉన్న కనెక్షన్ నుంచే వాహనాలను ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇందుకు ఇంటి కరెంటు బిల్లులో ఎంత ఛార్జీ వేస్తారో అంతే వసూలు చేయాలి.


-అపార్ట్ మెంట్లు, కాలనీలు, కార్యాలయ సమదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద ఛార్జీంగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి కోసం దరఖాస్తు చేసుకుంటే మెట్రో నగరాల్లో 7, మున్సిపాలిటీల్లో 15, గ్రామాల్లో 15 రోజుల్లోగా కొత్త కరెంటు కనెక్షన్లు డిస్కం లు ఇవ్వాలి.


-కొత్తగా నిర్మించే భవనాల్లో ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ భవన నిర్మాణాల బైలాస్ ను పురపాలక శాఖ మార్చాలి.


-దేశంలో ఎక్కడైనా, ఎవరైనా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇచ్చారు.


-యూనిట్ కరెంటు సరఫరాకు అయ్యే సగటు వ్యయం కన్నా ఎక్కువ ఛార్జీని స్టేషన్ల నుంచి వసూలు చేయకూడదు.


- జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు ఒక పీపీఎస్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. వీటి ఏర్పాటుకు పెట్రోల్ బంకుల యజమానులు ముందుకు వస్తే వారికి అవకాశమివ్వాలి.


-ప్రతి 3 కిలోమీటర్ల పరిధిలో ఒక స్టేషన్ ఉండాలి.


-పబ్లిక్ స్టేషన్ కోసం తక్కువ ఛార్జీకే బయట మార్కెట్లో ఎవరైనా అమ్మితే ఓపెన్ యాక్సెస్ లో కొనుగోలు చేసేందుకు 15 రోజుల్లో అనుమతి ఇవ్వాలి.

Latest News

 
చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే Fri, May 03, 2024, 06:30 PM
నటనలో ఓనమాలు నేర్చుకుంది విశాఖలోనే Fri, May 03, 2024, 06:30 PM
మైలవరంలో టీడీపీలోకి చేరికలు Fri, May 03, 2024, 06:28 PM
పిఠాపురంలో పవన్ గెలవడం ఖాయం Fri, May 03, 2024, 06:28 PM
ఎన్నికల బరిలో నిలిచింది వీరే Fri, May 03, 2024, 06:27 PM