డబ్బును తిరిగి పొందేందుకు మరింత సొమ్ము పోగొట్టుకుంది

by సూర్య | Sun, Jan 16, 2022, 07:40 PM

అనుభవం ఉంటేనే ఆన్లైన్ లేకుంటే తీవ్రంగా నష్ట పోతారు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిపుణులు .తాజా ఘటన ఇందుకు ఉదాహరణ  ముంబైలో ఓ వృద్ధురాలు ఘోరంగా మోసపోయింది. ఆన్‌లైన్‌లో పిజ్జా, డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తూ పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేసుకునేందుకు ప్రయత్నించి రూ.11 లక్షలకుపైగా డబ్బును కోల్పోయింది. దీంతో ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించింది. అంధేరి సబర్బన్‌లో ఉంటున్న ఓ పెద్దావిడ గత ఏడాది జూలైలో ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్ చేసింది దానికోసం ఆమె రూ.9,999లు పోగొట్టుకుంది. మళ్లీ అక్టోబర్ 29న కొన్ని డ్రైఫ్రూట్ల కోసం మరో ఆర్డర్ పెట్టి రూ.1,496లు కోల్పోయింది.అయితే ఆ డబ్బును తిరిగి పొందాలనే ఉద్దేశంతో గూగుల్లోకి వెళ్లి దొరికిన ఫోన్ నెంబర్‌‌కు ఫోన్ చేసింది. ఆ కాల్‌ను రిసీవ్ చేసుకున్న ఓ వ్యక్తి డబ్బులు తిరిగి వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చాడు. దానికోసం ఫోన్‌లో ఓ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని కోరాడు. వెంటనే ఆమె డౌన్‌లోడ్ చేసుకుంది. దాంతో ఆ మోసగాడు ఆమె బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్ వర్డ్‌లను తెలుసుకున్నాడు. అంతే ఆమె బ్యాంకు ఖాతా నుంచి లక్షలాది రూపాయలను లూటీ చేశాడు. గత ఏడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్‌ ఒకటో తేదీ మధ్యలో రూ.11 లక్షల 78 వేల రూపాయలను విత్ డ్రా చేశాడు.ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆ వృద్ధురాలు రీసెంట్‌గా సైబర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడ పోలీసులకు జరిగిన విషయాన్ని పూర్తిగా చెప్పింది. దాంతో అధికారులు చీటింగ్ కేసు పెట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ మోసగాళ్లను పట్టుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇలా నెట్‌లో కనిపించిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయవద్దని మోసగాళ్ల మాయలో చిక్కుకోవద్దని పోలీసులు సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM