తమిళనాడులో 23,989 కొత్త కేసులు.. 11 మంది మృతి

by సూర్య | Sun, Jan 16, 2022, 06:33 PM

ఒక్క తమిళనాడులోనే ఒక్కరోజే 23,989 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా 10, 11, 12 తరగతుల విద్యార్థులకు కూడా ఈ నెలాఖరు వరకు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు ఈ నెల 19న జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు విద్యాశాఖ తెలిపింది.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM