అవసరమైతేనే నెలపైకి...లేకుంటే కన్నేత్తిచూడవటా

by సూర్య | Sat, Jan 15, 2022, 04:20 PM

పక్షులు ప్రపంచంలో ఒక్కోచోట ఒక్కోలా ఉంటాయి. వాటిలో కొన్ని వింతలు కూడా ఉంటాయి. అలాంటి వింతే ఈ పక్షిలో ఉంది. ఈ పక్షి చూడండి. రూపు రేఖలు పావురంలా ఉన్నా కలర్ మాత్రం చిలుకలా ఉంది కదూ. దీన్ని పసుపు కాళ్ల పచ్చ పావురం (yellow-footed green pigeon) అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ ట్రెరాన్ ఫోనికాప్టెరస్ (Treron phoenicopterus). ఈ పక్షి.మన ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో ఇది ఎక్కువగా కనిపించదు గానీ... ఆ రాష్ట్ర పక్షి ఇదే (state bird of Maharashtra). మరాఠీ భాషలో దీన్ని హరోలీ, హరియల్ పక్షి అంటారు. ఇవి ఇండియాతోపాటూ... పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్ లో కూడా కనిపిస్తాయి. చూడటానికి పావురాల లాగా ఉన్నా ఇవి పావురాల లాగా గింజలు తినవు. చిలుకల లాగా పండ్లు, గింజలు, పూల మొగ్గలు, ధాన్యాల వంటివి తింటాయి. గుంపులుగా ఎగురుతాయి గానీ... నేలపై అస్సలు వాలవు. వీటిని చూడాలంటే పగటివేళే సరైనది. ఆ సమయంలో ఇవి దట్టమైన అడవుల్లో అతి ఎత్తైన చెట్లపై కనిపిస్తాయి. చెట్ల కొమ్మలపై జంటలుగా వాలి కనిపిస్తాయి. పావురాలు చెట్లపై గూళ్లు కట్టుకోవు కదా ఇవి చెట్లపై కట్టుకుంటాయి గానీ. అత్యంత ఎత్తుగా ఉండే చెట్లపై మాత్రమే గూళ్లు కట్టుకుంటాయి. మిగతా పక్షుల లాగే... గడ్డి పరకలు, ఆకులతో గూళ్లు నిర్మిస్తాయి. మనకే కాదు శాస్త్రవేత్తలకు కూడా ఇవి నేలపై ఎందుకు వాలవు అన్నది అర్థం కావట్లేదు. పావురాలు, చిలుకలు నేలపై వాలతాయి కదా మరి ఆ లక్షణాలతో ఉన్న ఈ పక్షులు ఎందుకు వాలవన్నది తేలాల్సిన ప్రశ్న. ఓ అంచనా మాత్రం ఉంది. ఏంటంటే నేలపై వాలాలంటే అందుకు తగిన అవసరం ఉండాలి కదా. ఈ పక్షులకు నేలపై వాలాల్సిన అవసరం ఉండట్లేదు. ఎందుకంటే... ఆహారం కోసం పండ్లను తింటున్నాయి. నీటి కోసం ఇవి చెట్లపై ఆధారపడుతున్నాయి.

Latest News

 
ఊరవతల నగ్నంగా మహిళ మృతదేహం.. అసలేమైంది Sun, May 19, 2024, 07:44 PM
మెగా ఫ్యామిలీపై పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు Sun, May 19, 2024, 07:42 PM
యువకులే టార్గెట్.. రూ.లక్షల్లో జీతాలంటూ వల.. ఆపై విదేశాలకు తీసుకెళ్లి దారుణాలు Sun, May 19, 2024, 07:32 PM
వేరుశనగ విత్తనాలకు దరఖాస్తులు చేసుకోండి Sun, May 19, 2024, 07:08 PM
సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఎం నేతలు Sun, May 19, 2024, 07:05 PM