శంకర్ దాదా ఎంబీబీఎస్ వేశాడు మరి..టీకాతో నడవలేని వ్యక్తి స్పందించాడు

by సూర్య | Sat, Jan 15, 2022, 02:14 PM

శంకర్ దాదా ఎంబీబీఎస్ ట్రీట్ మెంట్ తరహాలో ఓ వ్యక్తికి టీకా పనిచేసింది. మంచంలో ఉన్న వ్యక్తి టీకా వేయగానే ఆతను స్పందించడం మొదలెట్టాడటా. క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటే దుష్ప్ర‌భావాలు వ‌స్తాయ‌ని ఇప్ప‌టికీ చాలా మంది అన‌వ‌స‌ర భ‌యాలు పెట్టుకుని టీకాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఓ వ్య‌క్తి తాను వ్యాక్సిన్ వేయించుకుంటే క‌రోనా నుంచి ర‌క్ష‌ణ మాత్ర‌మే కాకుండా అంత‌కు మించిన ప్ర‌యోజ‌నాలు చేకూరాయ‌ని చెబుతున్నాడు. తాను చాలా కాలంగా అనారోగ్యంతో మంచానికే ప‌రిమిత‌మ‌య్యాన‌ని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మంచం దిగి నడవడం ప్రారంభించాన‌ని అంటున్నాడు. ఈ ఘటన ఝార్ఖండ్ లోని బొకారో జిల్లా, పెటార్వార్ గ్రామంలో చోటు చేసుకుంది. దులార్‌చంద్ (44) అనే వ్య‌క్తి నాలుగేళ్ల క్రితం ఓ ప్రమాదానికి గురై, మాటను కూడా కోల్పోయి మంచానికే ప‌రిమిత‌మ‌య్యాడు. ఈ నెల 4వ తేదీన ఆయ‌న కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాడు. ఇన్నాళ్లూ మంచం మీద ఉన్న ఆయ‌న‌ శరీరం టీకా తీసుకున్నాక‌ స్పందించం ప్రారంభించింది. మెల్లిగా మంచం మీద నుంచి లేచి తిరిగాడు. ఈ విష‌యాన్ని పెటార్‌వార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ అల్బెల్ కెర్కెట్టా మీడియాకు వివ‌రించారు. టీకా తీసుకున్నాక‌ దులార్ చంద్ నడవడమే కాకుండా, తన స్వరాన్ని తిరిగి పొందాడని, ఇప్పుడు మాట కూడా మాట్లాడుతున్నాడ‌ని పేర్కొన్నారు. క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాతే త‌న‌ కాళ్లలో కదలిక వచ్చిందని దులార్ చంద్ కూడా వివ‌రించారు. దీంతో దులార్ చంద్ వైద్య చరిత్రను విశ్లేషించేందుకు ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక వైద్యాధికారి ఆదేశించారు.

Latest News

 
ఏపీ రెయిన్ అలెర్ట్ Thu, May 09, 2024, 11:43 PM
రేపు ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు Thu, May 09, 2024, 10:15 PM
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించాల్సిందే : సీఎం జగన్ Thu, May 09, 2024, 09:45 PM
రూ.8.39 కోట్ల నగదు సీజ్ Thu, May 09, 2024, 06:20 PM
రోడ్ షో నిర్వహించిన టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు Thu, May 09, 2024, 06:16 PM