రైల్వే గార్డ్ పేరు.. ట్రెయిన్ మేనేజర్ గా మార్పు

by సూర్య | Sat, Jan 15, 2022, 02:13 PM

రైల్వేశాఖ ఓ కీలక నిర్ణయం తీసుకొంది. ఓ పోస్ట్ కు చెందిన పేరును మార్చుతూ ఆ నిర్ణయం తీసుకొంది. రైల్వే గార్డ్.. రైలు చివరి పెట్టె ద్వారం వద్ద తెల్లని ప్యాంట్, షర్ట్ ధరించి, చేతిలో గ్రీన్ జెండా పట్టుకుని కనిపించే వ్యక్తి. రైలు ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికీ రైల్వే గార్డ్ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు రైల్వే గార్డ్ పేరును.. ట్రెయిన్ మేనేజర్ గా రైల్వే శాఖ మార్చింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చేసింది. గార్డ్ అంటే రక్షకుడు, కాపలాదారుడు అనే అర్థాలు స్ఫుర్తిస్తాయి. కానీ రైల్వే గార్డ్ సేవలు అంతకుమించి ఉంటాయి. కనుక వారిలో మరింత ప్రేరణ కల్పించాలని, వారి విధులు, బాధ్యతలకు అనుగుణంగా ఉండాలని రైల్వే శాఖ పేరులో మార్పును తీసుకొచ్చింది. పేరులోనే తప్ప ఇతరత్రా వారికి సంబంధించి వేతనాలు, బాధ్యతల్లో మార్పు ఉండదని భారతీయ రైల్వే ప్రకటించింది. రైల్వే గార్డ్ అటు రైలు నడిపే పైలట్ తోను, స్టేషన్ మేనేజర్లతో సమన్వయం చేస్తుంటాడు. ప్రతీ స్టేషన్ నుంచి రైలు వెళ్లేందుకు క్లియరెన్స్ తీసుకుంటాడు. ఎక్కడైనా సిగ్నల్ పరంగా సమస్య ఏర్పడినా, ఇతరత్రా సవాళ్లు ఎదురైనా గార్డ్ సూచనల మేరకు పైలట్ నడుచుకుంటాడు.

Latest News

 
ఘనంగా గోవిందరాజస్వామి గరుడ సేవ.. శ్రీవారి నుంచి భారీగా కానుకలు Mon, May 20, 2024, 10:01 PM
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలకు ఇబ్బందులు.. అప్పటి నుంచి బంద్ Mon, May 20, 2024, 09:54 PM
తెలుగువారి కీర్తి విశ్వవ్యాప్తం.. గోపీచంద్ తోటకూర అంతరిక్ష యానం, సరికొత్త రికార్డ్ నమోదు Mon, May 20, 2024, 09:02 PM
అమలాపురంలో కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన మహిళ.. స్కాన్ చేసిన డాక్టర్లు షాక్, అరుదైన సర్జరీ! Mon, May 20, 2024, 08:58 PM
శ్రీశైలం వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆ టికెట్ రేట్లతో, ఏమైందంటే Mon, May 20, 2024, 08:55 PM