కుధేలవుతున్న కర్ణాటక..అయినా స్పీడు తగ్గించని కరోనా

by సూర్య | Fri, Jan 14, 2022, 10:11 PM

కర్ణాటకలో మరీ ముఖ్యంగా బెంగళూరులోని ఐటీ హబ్ పై కరోనా తన తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్ దెబ్బతో భారతదేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు హడలిపోతున్నారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బతో వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో కూడా వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ రోజు రాత్రి నుంచి సోమవారం (జనవరి 17వ తేదీ ఉదయం వరకు) కర్ణాటకలో వీకెండ్ లాక్ డౌన్, కర్ఫ్యూ జారీ అయ్యింది. కర్ణాటకలో మరోసారి కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి. ఈ విషయం కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ శుక్రవారం స్వయంగా ట్వీట్ చేశారు. ఒక్కరోజులో కర్ణాటకలో కొత్తగా 28, 723 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయితే బెంగళూరులో మాత్రమే కొత్తగా 20, 121 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Latest News

 
ఏపీ రెయిన్ అలెర్ట్ Thu, May 09, 2024, 11:43 PM
రేపు ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు Thu, May 09, 2024, 10:15 PM
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించాల్సిందే : సీఎం జగన్ Thu, May 09, 2024, 09:45 PM
రూ.8.39 కోట్ల నగదు సీజ్ Thu, May 09, 2024, 06:20 PM
రోడ్ షో నిర్వహించిన టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు Thu, May 09, 2024, 06:16 PM