దళితుడి ఇంట్లో భోజనం చేసిన యోగి:బీజేపీకి ఇది కలిసొచ్చేనా

by సూర్య | Fri, Jan 14, 2022, 10:10 PM

చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నట్లుగా యూపీలోని బీజేపీ పరిస్థితి తయారైంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో సామాజిక న్యాయం లేదంటూ పార్టీకి రాజీనామా చేసి.. ఆరోపణలు గుప్పించిన మాజీ మంత్రులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా తిప్పికొట్టారు. తమ పాలనలో అన్ని వర్గాలకు సమ న్యాయం జరిగందన్నారు. గోరఖ్ పూర్‌లోని ఓ దళితుడి ఇంట్లో యోగి భోజనం చేశారు. వంశపారంపర్య రాజకీయాలు చేసే వారు సమాజంలో ఏవర్గానికి న్యాయం చేయలేరంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేఖ్ యాదవ్ పైవిరుచుకుపడ్డారు. అఖిలేశ్ యాదవ్ పాలనలోనే సామాజిక దోపిడి జరిగిందని మండిపడ్డారు. యూపీలోని బీజేపీ నుంచి వరుసగా మంత్రులు, ఎమ్మెల్యే రాజీనామా బాటపట్టడంతో ఆపార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. సీఎం యోగి ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. గోరఖ్ పూర్‌లో ఓ దళితుడు నివాసంలో భోజ‌నం చేశారు. అమృత్ లాల్ భారతీ ఇచ్చిన అథిత్యాన్ని సీఎం స్వీకరించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన జుంగియాకు చెందిన అమృతలాల్ భారతి నివాసంలో సంక్రాతి పండుగ సందర్భంగా ఖిచ్డీ, ప్రసాదాన్ని స్వీకరించే అదృష్టం తనకు కలిగిందన్నారు. దళితుడు అమృత్ లాల్ భారతితో కలిసి భోజనం చేసిన వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సీఎం యోగి .

Latest News

 
హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులకు అండగా నిలవాలి Mon, May 20, 2024, 04:53 PM
భారీ వర్షంతో కాస్త ఉపశమనం Mon, May 20, 2024, 04:17 PM
ట్రాక్టర్ ఢీకొన్న ప్రైవేట్ బస్ Mon, May 20, 2024, 04:06 PM
తప్పు చేసిన వారెవరు తప్పించుకోలేరు Mon, May 20, 2024, 03:44 PM
ఆదివారం అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ Mon, May 20, 2024, 03:43 PM