బీఎస్పీలో టిక్కెట్ల లొల్లి...టిక్కెట్ దక్కదని ఎడ్చేసిన నేత

by సూర్య | Fri, Jan 14, 2022, 10:05 PM

యూపీలో హోరా...హోరీగా తలపడేందుకు బీజేపీ, ఎస్పీ పార్టీలు సిద్దమవుతుంటే బీఎస్పీలో మాత్రం టిక్కెట్ల పంచాయతీ మొదలైంది. ఒకపుడు యూపీలో చక్రం తిప్పిన బీఎస్పీ పరిస్థితి ఇపుడు ఆ రాష్ట్రంలో పెద్దగా ఆశించని విధంగా లేదు. అయినా ఈ ఎన్నికల్లో టిక్కెట్ల విషయంలో మాత్రం పొటీ తీవ్రంగానే సాగుతోంది. ఇదిలావుంటే యూపీలోని బహుజన పార్టీ నేత అర్షద్ రాణా ముజఫర్‌నగర్‌లోని చార్తావాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దధేడు గ్రామానికి చెందిన ఆయన ఈ చార్తావాల్ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పార్టీ కోసం చాలా ఖర్చుపెట్టానే. టికెట్ విషయంపై పార్టీలో సినీయర్ నేతలకు మనసులో మాటల చెప్పారు. ఆయన భార్య కూడా బీఎస్పీ నుంచి జిల్లా పంచాయతీ మెంబర పదవికి పోటీ చేశారు. తనకు అసెంబ్లీ టికెట్ వస్తుంద‌న్న‌ కొండంత ఆశతో ప్రచారం చేసుకున్నారు అర్షద్ రాణా. అయితే అర్షద్ రాణా ఆశలను బీఎస్పీ అధిష్టానం నీరు కార్చింది. చార్తావాల్ అసెంబ్లీ టికెట్ సల్మాన్ సయీద్‌కు కేటాయిస్తున్నట్లు బీఎస్పీ అధినేత్ర మాయావతి ట్వీట్ చేశారు. బీఎస్పీ కార్యకర్తలు ఆయన గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హోం శాఖ మాజీ రాష్ట్ర మంత్రి సయీదుజ్జమాన్ కుమారుడై సల్మాన్ సయిద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో ఇనాళ్లు తన కష్టం బూడిదలో పోయిన పన్నీరులా మారిందంటూ అర్షద్ రాణా ఆవేదన వ్యక్తం చేశారు. తన మద్దతుదారులతో కలిసి కొత్వాలి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. తన ఆవేదనను వెళ్లబుచ్చాతూ బోరున ఏడ్చారు. రెండు సంవత్సరాల క్రితం పార్టీలోని ఓ సీనియర్ నేత తన వద్ద టికెట్ కోసం రూ.67 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు తనకు టికెట్ నిరాకరించి వేరేవాళ్లకు ఇచ్చారని కన్నీళ్లు పెట్టకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం కోసం లక్షలు ఖర్చుపెట్టుకున్నాన‌ని పోలీసులు ఫిర్యాదు చేశారు. తనకు టికెట్ కేటాయించనందుకు తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని పార్టీ నాయకులను డిమాండ్ చేశారు అర్షద్ రాణా. సదరు బీఎస్పీ నేతలపై ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest News

 
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 03:18 PM
షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు Fri, May 03, 2024, 02:50 PM
మోసపూరిత మాటలు నమ్మవద్దు: ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము Fri, May 03, 2024, 02:46 PM
విద్యుత్ నియంత్రికలో మంటలు.. రూ. 8 లక్షల నష్టం Fri, May 03, 2024, 02:45 PM
పెనగలూరు మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ప్రచారం Fri, May 03, 2024, 02:10 PM