అమ్మో కరోనా...ఇక్కడా వేలు పెట్టేసింది...పశ్చ్

by సూర్య | Fri, Jan 14, 2022, 10:04 PM

కరోనా దెబ్బ రుచి అలాంటిది..ఇలాంటిది కాదండోయ్. సెక్స్ రుచి ముందు ఏ రుచి కలసిరాదు అంటారు. ఆ రుచికే రుచి చూపించింది కరోనా. దాని దెబ్బకు సెక్స్ మీదే మనుషులకు ఆసక్తితగ్గిందంటా. అదేలా తెలిసిందంటారా...? ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను మరోసారి అల్లకల్లోలానికి గురి చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార లావాదేవీలను తీవ్రంగా ప్రభావితం చేసింది. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్‌డౌన్ తరహా పరిస్థితులను విధించాల్సి రావడంతో అన్ని రంగాలు కుదేల్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయనుకునే దశలో మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. కరోనా కేసులు భారీగా పెరగడానికి ఇదీ ఓ కారణమైంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. ఆర్థికరంగాన్ని అతలాకుతలం చేస్తోన్నాయి. కార్పొరేట్ సెగ్మెంట్‌లో ఎవర్ గ్రీన్‌గా చెప్పుకొనే కంపెనీలు సైతం నష్టాల బారిన పడటం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. కండోమ్ తయారీ కంపెనీలు సైతం నష్టాలబాట పడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లాక్‌డౌన్‌ను విధించిన సమయంలో ఒక్కసారిగా పెరిగిన వాటి అమ్మకాలు.. ఇప్పుడు ఢామ్మంటూ పడిపోయాయి.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM