కరోనా ఎఫెక్ట్...స్కూళ్లు బంద్

by సూర్య | Fri, Jan 14, 2022, 06:51 PM

కరోనా దూకుడు కారణంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నిస్కూళ్లను బంద్ చేస్తూ నిర్ణయం తీసుకొంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను (1 నుంచి 12వ తరగతి) ఈ నెల 31 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు, ఇతర వేడుకలను నిషేధిస్తున్నట్టు తెలిపింది. మకర సంక్రాంతి స్నానాలపై నిషేధం లేదని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న ఒక్క రోజు మధ్యప్రదేశ్ లో కొత్తగా 4,031 కరోనా కేసులు వచ్చాయి. ముగ్గురు మరణించారు. పాజిటివిటీ రేటు 4.5 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM