రెండు విడతలుగా పార్లమెంటు సమావేశాలు

by సూర్య | Fri, Jan 14, 2022, 06:46 PM

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను రెండు విడుతలుగా నిర్వహించనున్నారు. ఇదిలావుంటే కేంద్ర వార్షిక బడ్జెట్ కు సమయం ఆసన్నమైంది. జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. జనవరి 31 ఉభయ సభలను ఉద్దేశంచి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. ఇదిలావుంటే బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫ్రిబవరి 11 వరకు రెండో విడతలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు సభా సమావేశాలు జరుగుతాయి. మార్చి 18న హోలి సందర్భంగా పార్లమెంటు సమావేశాలు జరగవు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. ఇదిలావుంటే పార్లమెంటులో 400 మంది సిబ్బంది కరోనా సోకడంతో, పార్లమెంటు సమావేశాల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సమీక్ష జరిపారు. కరోనా మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటిస్తూ, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM