నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా:చిరంజీవి

by సూర్య | Fri, Jan 14, 2022, 06:43 PM

తాను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవీ పేర్కొన్నారు. ఇదిలావుంటే నిన్న ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సినిమా టికెట్ల అంశంపై సీఎంతో చర్చించానని స్వయంగా చిరంజీవి వెల్లడించారు. అయితే, చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. దీనిపై చిరంజీవి స్పందించారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యానని స్పష్టం చేశారు. తనకు రాజ్యసభ టికెట్ అనేది కేవలం ప్రచారమేనని వెల్లడించారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇదిలావుంటే చిరంజీవి ఈ సాయంత్రం మళ్లీ ఏపీకి రానున్నారు. సాయంత్రం 5 గంటలకు కుటుంబ సమేతంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. డోకిపర్రులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే గోదాదేవి కల్యాణోత్సవానికి చిరంజీవి కుటుంబం హాజరు కానుంది.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM