రెండు వర్గాల మధ్య కక్షల వల్ల ఆ హత్య జరిగింది
 

by Suryaa Desk |

తోట చంద్రయ్య హత్య రెండు వర్గాల మధ్య కక్షల వల్ల జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  తెలిపారు. ఇదిలావుంటే గుంటూరు జిల్లా మాచర్ల నియోజకర్గంలోని గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యకు గురికావడం రాజకీయ దుమారం రేపింది. వైసీపీ గూండాలే చంద్రయ్యను హత్య చేశారంటూ టీడీపీ అధినాయకత్వం ఆరోపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రయ్య హత్య రెండు వర్గాల మధ్య కక్షల వల్ల జరిగిందని తెలిపారు. అంతే తప్ప, ఈ హత్యతో వైసీపీకి ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలకు తాను చాలా దూరంగా ఉంటానని, ఆ దిశగా ఎవరినీ ప్రోత్సహించనని వెల్లడించారు. చంద్రయ్య హత్య నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM